మిచాంగ్​ ఎఫెక్ట్​: విజయవాడ దుర్గగుడి ఘాట్ మూసివేత

మిచాంగ్​ ఎఫెక్ట్​: విజయవాడ దుర్గగుడి ఘాట్ మూసివేత

మిచాంగ్ తుఫాన్ ప్రభావం వల్ల విజయవాడలో భారీగా వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి కొండ చరియలు విరిగిపడతాయని దుర్గగుడి అధికారులు ముందుగానే ఘాట్ రోడ్డు మూసి వేశారు. దుర్గగుడికి కార్లకు, ద్విచక్ర వాహనాలు పై వచ్చే భక్తులకు అనుమతి లేదని దుర్గగుడి అధికారులు తెలిపారు. దుర్గ గుడికి వచ్చే భక్తులు మెట్ల మార్గం, లిఫ్ట్ మార్గం ద్వారా దుర్గగుడికి రావాలని ఆలయ అధికారులు సూచించారు.

భక్తుల భద్రతా కారణాల దృష్ట్యా ఘాట్ రోడ్డు ద్వారా వాహనాల రాకపోకలు నిలిపివేశారు. వర్షాలు తగ్గేవరకూ ఘాట్ రోడ్డు మూసి ఉంచాలని నిర్ణయించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు కనకదుర్గ నగర్ మార్గం ద్వారా రావాలని సూచించారు.

 మిచాంగ్ తుఫాన్ భయానకంగా మారింది. ఏపీ వైపు తుఫాన్ దూసూకోస్తోంది. తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మిచాంగ్ తీవ్ర తుఫాన్ ప్రస్తుతం చెన్నైకి 170 కిలో మీటర్లు, నెల్లూరుకు 20 కిలో మీటర్లు, బాపట్లకు 150 కిలో మీటర్లు, మచిలీపట్నానికి 210కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. మధ్యాహ్నానానికి నెల్లూరు – మచిలీపట్నం మధ్య బాపట్ల దగ్గర మిచాంగ్ తీవ్ర తుఫానుగా తీరం దాటనుంది.